»Calendar Release Of Tirumala Srivari Seva Tickets
Tirumala : తిరుమల శ్రీవారి సేవా టికెట్ల క్యాలెండర్ విడుదల
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా దర్శన టికెట్ల విడుదల తేదీలకు సంబంధించి క్యాలెండర్ను టీటీడీ విడుదల చేసింది.
తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు(Devotees) తరలి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం(Special Darshanam), ఇతర సేవా టికెట్లను టీటీడీ(TTD) నెలకొకసారి ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ వస్తోంది. తాజాగా ఏప్రిల్ నెలలో ఒక్కో తేదీకి సంబంధించిన క్యాలెండర్ను టీటీడీ రిలీజ్ చేసింది. తిరుమల శ్రీవారి భక్తులకు ఈ క్యాలెండర్(Calender Release) ఎంతగానో ఉపయోగపడనుంది.
ఏప్రిల్ 20వ తేదిన ఉదయం 10 గంటలకు జులై నెల ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ(TTD) విడుదల చేయనుంది. లక్కీడిప్ ద్వారా ఈ టికెట్లను కేటాయించనుంది. అలాగే 11.30 గంటలకు జులై నెలకు సంబంధించి ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను టీటీడీ(TTD) విడుదల చేయనుంది.
ఏప్రిల్ 21న ఉదయం 10 గంటలకు జులై నెల అంగప్రదక్షిణం సేవాల టికెట్లను టీటీడీ(TTD) విడుదల చేయనుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శన టికెట్లను టీటీడీ ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేయనుంది. ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆ రోజే మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెల టోకెన్లను విడుదల(Tokens Release) చేయనుంది.
ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు మే నెల రూ.300ల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లను టీటీడీ(TTD) విడుదల చేయనుంది. ఏప్రిల్ 26వ తేదిన ఉదయం 10 గంటలకు మే నెలలో తిరుమల(Tirumala)లోని వసతి గదుల కోటాను రిలీజ్ చేయనుంది. ఏప్రిల్ 27వ తేదన ఉదయం 10 గంటలకు మే నెలలో తిరుమలలోని వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయనున్నట్లు క్యాలెండర్ను విడుదల(Calender Release) చేసింది.