»Telangana Manjeera Pushkaralu Starts From April 22nd
Manjeera Pushkaralu ఈనెల 22 నుంచి మంజీరా నది పుష్కరాలు..
నదిలో స్నానాలు చేస్తే సకల పాపాలు హరిస్తాయని నమ్మకం. ఇక పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మలు శాంతిస్తాయని విశ్వాసం. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
నదులకు 12 ఏళ్లకు ఓసారి పుష్కర మహోత్సవాలు జరుగుతాయి. ఈనెలలో గంగా నది పుష్కరాలతో మంజీరా నది పుష్కరాలు జరుగనున్నాయి. మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో ప్రవహిస్తూ గౌడ్ గావ్ వద్ద తెలంగాణలోకి ఈ నది అడుగుపెడుతుంది. మంజీరా రాష్ట్రంలో ముఖ్యమైన నది. ఈ నది పుష్కరాలు ఈనెల 22వ తేదీ నుంచి 12 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
మంజీరా నది మొత్తం పొడవు 724 కిలో మీటర్లు. మెదక్, నిజామాబాద్ జిల్లాలో ప్రవేశించి రెంజల్ మండలం కందకుర్తి గ్రామం వద్ద మంజీరా గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నది పుష్కరాలు మే 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పుష్కర సమయంలో నదిలో స్నానాలు చేస్తే సకల పాపాలు హరిస్తాయని నమ్మకం. ఇక పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మలు శాంతిస్తాయని విశ్వాసం. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. స్నానఘట్టాలు నిర్మాణం, దుస్తులు మార్చుకునే గది.. షవరింగ్ వంటి పనులు శరవేగంగా చేస్తున్నారు. ఈనెల 24, 25, 27, 30 తేదీల్లో స్నానాలు చేస్తే అత్యంత పుణ్య ఫలం లభిస్తుంది. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
కాగా ఈ పుష్కరాల సమయంలోనే మంజీరా కుంభమేళా నిర్వహించనున్నారు. ఈనెల 24 నుంచి మే 5వ తేదీ వరకు మంజీరా కుంభమేళా నిర్వహిస్తామని సిద్ధ సరస్వతీ దేవి పంచవటి క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్ బాబా తెలిపారు. గతంలో 2010, 2013, 2018లో ఈ కుంభమేళాలు నిర్వహించగా తాజాగా పుష్కరాల సందర్భంగా మరోసారి మంజీరా కుంభమేళా నిర్వహిస్తున్నారు.