గత మూడు రోజుల నుంచి మంజీరా పుష్కరాలు(Manjeera Pushkar) జరుగుతున్నాయి. తాజాగా నేడు మంజీరా కుంభమేళ(Manjeera Kumbh Mela)కు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. మంజీరా నది పుష్కరాలకు విచ్చేసిన భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి దైవారాధన చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలంలోని రాఘవపూర్, హుమ్నాపూర్ శివారుల్లో బుధవారం భక్తులు(Devotees) తాకిడి ఎక్కువయ్యింది.
మంజీరా నది వద్ద గరుడ గంగా కుంభమేళ(Manjeera Kumbh Mela)ను అధికారులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులు(Devotees) అధిక సంఖ్యలో తరలివచ్చారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. పంచవటీ క్షేత్రాన్ని దర్శించుకుని దైవ సన్నిధిలో గడిపారు.
మంజీరా కుంభమేళా(Manjeera Kumbh Mela) సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు, స్నానాలు చేసుకునేందుకు ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తును నిర్వహించారు.