పెద్దపల్లిలో శుక్రవారం కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలను వెంటనే విడనాడాలని డిమాండ్ చేస్తూ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో ITI గ్రౌండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.