సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలుడి కిడ్నాప్ (Kidnap) కలకలం సృష్టిస్తున్నది. ప్లాట్‌ఫామ్‌పై ఒంటరిగా ఉన్న ఐదేండ్ల బాలుడిని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా సీసీటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు బాలుడిని ఎత్తుకెళ్తున్నట్లు అందులో తేలింది. మెదక్ జిల్లా (Medak District) రాయలాపురం గ్రామానికి చెందిన దుర్గేష్ తన కుమారుడు శివసాయితో కలిసి తిరుపతి వెళ్లి తిరుగుపయనమయ్యారు. ఉదయం 5:30 గంటలకు రైల్వే స్టేషన్ చేరుకోగా ఒకటో ఫ్లాట్ ఫారం (Flat form)పై కుమారుడిని, లగేజ్ బ్యాగ్ పెట్టి వాష్ రూమ్ వెళ్లాడు. కొద్దిసేపటికి బాలుడు కనిపించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించగా సీసీ కెమెరాల ఆధారంగా గాలిస్తున్నారు.
స్టేషన్ మొత్తం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రైల్వే పోలీసు(Railway Police)లకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో బాలుడిని ఎవరో గుర్తుతెలియని దంపతులు తీసుకెళ్లినట్లు కనిపించింది. దీనిపై కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాలుడిని ఎత్తుకెళ్లిన దృష్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా, దుర్గేష్, అతని కుమారుడి కదలికలను గమనించిన వ్యక్తులే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడి కిడ్నాప్ వెనుక మరాఠా బెగ్గింగ్ మాఫియా (Begging mafia) హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బృందాలుగా ఏర్పడిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.