భాగ్యనగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సిటీగా మార్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు.వరల్డ్ హెరిటేజ్ డే (World Heritage Day) సందర్భంగా నగరంలోని పలు వారసత్వ కట్టడాలకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. గత కొన్నేళ్లుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (Municipal Administration) శాఖ ఆధ్వర్యంలో.. ఇతర ప్రభుత్వ శాఖల సహకారంతో అనేక వారసత్వ కట్టడాలను పునరుద్ధరించాము. గతంలో శిథిలావస్థకు చేరుకున్న ఆ సంపదను.. ఇప్పడు అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్లుగా మార్చినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ (Hyderabad)నగరంలో ఉన్న ఇలాంటి ప్రదేశాలు సరికొత్త శోభను సంతరించుకొని పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. బన్సీలాల్పేట(Bansilalpet) లోని మెట్ల బావి పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోగా.. ఇటీవలే దాన్ని పునరుద్ధరించారు. మొజంజాహీ మార్కెట్(Mojanjahi Market), క్లాక్ టవర్, గోల్కొండ మెట్ల బావి కూడా పూర్వ శోభను సంతరించుకున్నాయి. నగరానికి వారసత్వంగా వచ్చిన కట్టడాలను సంరక్షించుకోవడం మన బాధ్యత అని మంత్రి చెప్పారు.