Qualcomm: ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ క్వాల్కామ్(Qualcomm) భారత్‌లో రూ.177 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. చెన్నైలో జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఆదివారం ఈ ప్రకటన చేసింది. ఈ మొత్తాన్ని చెన్నైలోని తమ తయారి కేంద్రంలో కొత్త డిజైన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. దీంతో అదనంగా మరో 1,600 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించింది. కొత్త సెంటర్లో వైఫై టెక్నాలజీపై దృష్టి పెడుతూ వైర్లెస్ కనెక్టివిటీ పరిష్కారాలను అభివృద్ధి చేయనున్నట్లు క్వాల్కామ్ వివరించింది. 5జీ టెక్నాలజీ(5G technology) అభివృద్ధిలో తమ అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధి కేంద్రానికీ ఈ కొత్త సెంటర్ బాగా ఉపయోగపడుతుందని వెల్లడించింది. వైర్లెస్ కమ్యూనికేషన్ పరిశ్రమలో తమ సంస్థ ముందంజలో ఉంటుందని తెలిపారు.