»Minister Amarnath Is A Big Shame At Visakhapatnam Inorbit Meeting
Minister amarnath: కు ఘోర అవమానం..ఎవరికి చెప్పుకోవాలి
ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మళ్లీ బుక్కాయ్యారు. కానీ ఈసారి మాత్రం కామెంట్లు చేయడం వల్ల మాత్రం కాదు. పాపం ఈ మంత్రికి ఘోర అవమానం జరిగిందనే అనిపిస్తోంది. అది కూడా సీఎం ఉన్న కార్యక్రమం నిండు సభలో జరిగింది. అసలేం జరిగింది? ఎందుకు అవమానం జరిగింది? ఈ నేపథ్యంలో మంత్రి పార్టీ మారుతున్నారా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో అనేక సార్లు పలు కామెంట్లు చేసి అడ్డంగా దొరికిపోయిన ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్(minister amarnath) ఈసారి ఏమి మాట్లాడకుండానే బుక్కైపోయారు. అవును ఈ మంత్రికి నిన్న విశాఖపట్నం(visakhapatnam)లో జరిగిన ఇనార్బిట్ మాల్(inorbit mall) శంకుస్థాపన కార్యక్రమంలో ఘోర అవమానం జరిగినట్లు అనిపిస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి సీఎం జగన్, మంత్రులు విడదల రజిని, సురేష్, అమర్ నాథ్ కూడా వచ్చారు. దీంతోపాటు ఇనార్బిట్ మాల్ సంస్థల అధినేత నీల్ రహేజా సహా పలువురు నేతలు కూడా హాజరయ్యారు.
అయితే జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమంలో భాగంగా గుడివాడ అమర్ నాథ్ ను కూడా పిలిచారు. కానీ అస్సలు పట్టించుకోలేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా అసలు మంత్రి వైపే చూడలేదు. అయినప్పటికీ మంత్రి అమర్ నాథ్ స్వయంగా కలుగజేసుకుని సీఎంకు క్యాండిల్ అందించారు. ఆ తర్వాత ఇనార్బిట్ మాల్ సంస్థల అధినేత నీల్ రహేజా జ్యోతి దీపాన్ని అంటించారు. కానీ ఆ తర్వాత సీఎం జగన్(cm jagan) మంత్రి విడుదల రజినిని పిలించి జ్యోతి అంటించాలని కోరారు. ఆమె జ్యోతిని అంటించిన తర్వాత..క్యాండిల్ కావాలని మంత్రి అమర్ నాథ్ చేయి చాపినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. మరొక వ్యక్తికి ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి సురేష్ కూడా క్యాండిల్ తో ముట్టించారు. అయినా కూడా తర్వాత మంత్రి అమర్ నాథ్ క్యాండిల్ ను తీసుకుని ముట్టించే ప్రయత్నం చేశారు. కానీ మళ్లీ అది వేరే వాళ్ల చేతికి చేరగా తర్వాత అతను ముట్టించి దాన్ని ఆర్పేశారు. దీంతో ఆవేదన చెందిన అమర్ నాథ్ కోపంతో ఆ క్యాండిల్ తీసి పక్కన పెట్టేశారు.
నిండు సభలో ఇద్దరు మంత్రులకు అవకాశం ఇచ్చి కూడా తనకు ఛాన్స్ ఇవ్వలేదంటే ఏమనుకోవాలి. కావాలనే చేశారా? లేదా అనుకోకుండా అలా జరిగిందా అనేది మాత్రం తెలియలేదు. మొత్తానికి అనేక మంది చూస్తున్న కార్యక్రమంలో మంత్రి అమర్ నాథ్ కు ఇది ఘోర అవమానం అనే చెప్పుకోవాలి. అంతేకాదు ఆ సభలో కీలక మంత్రల పక్కనే ఉండాల్సిన మంత్రి కూర్చిని కూడా ఎక్కడో మూలకు వేశారు. ఇది తెలిసిన మంత్రి అమర్ నాథ్ అనుచరులు ఇంత అవమానం(big shame) జరిగిన తర్వాత పార్టీలో వద్దని మారుదాం అని చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఈ మంత్రికి సీటు కూడా వచ్చుడు డౌట్ అని మరికొంత మంది అంటున్నారు.