స్పేస్ ఎక్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఇంటర్నెట్ (Internet) సేవలను అందించడానికి ఏర్పాటు చేసిన స్టార్లింక్కు పోటీగా బెజోస్ సైతం కూపర్ ఇంటర్నెట్ నెట్వర్క్ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం రూ.8000 కోట్ల (10 బిలియన్ డాలర్స్)ను ఇన్వ్స్టమెంట్ (Investment)పెట్టాలని నిర్ణయించింది. ఇంటర్నెట్ సేవలను అందించడానికి అమెజాన్, స్పేస్ఎక్స్ వంటి సంస్థలు ఉపగ్రహాలను స్వల్ప భూ కక్ష్యలో ప్రవేశపెడతాయి. ఇవి భూమికి సుమారు 590 నుంచి 630 కి.మీ. ఎత్తులో ఉంటాయి. తద్వారా కేబుల్స్, ఫైబర్ ద్వారా నెట్ అందించలేని ప్రాంతాలకూ శాటిలైట్ల ద్వారా అంతర్జాల సేవలను అందించొచ్చు. అందుకే అమెజాన్, స్పేస్ఎక్స్ (SpaceX)ఈ వ్యాపారంపై దృష్టి పెట్టాయి.