NGKL: సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగన మోని బంగారు బాబు డిమాండ్ చేశారు. జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆయన ఆదివారం ఎస్సీ హాస్టల్లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తేవాలని విద్యార్థులకు ఆయన సూచించారు.