»Telangana Government File Writ Petition At Supreme Court To Governor
ts government file writ petition:సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎందుకంటే?
ts government file writ petition:తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ (governer Tamilisai Soundararajan ) మధ్య వివాదం సద్దుమణగలేదు. బిల్లుల పెండింగ్ అంశంపై బీఆర్ఎస్ సర్కార్ (government) సీరియస్‌గా ఉంది. ఇదే అంశంపై పలుమార్లు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినా.. ఫలితం లేదు. ఇక చేసేది లేక సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (supreme court) తలుపు తట్టింది.
telangana government file writ petition at supreme court to governor
ts government file writ petition:తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ (governer Tamilisai Soundararajan ) మధ్య వివాదం సద్దుమణగలేదు. బిల్లుల పెండింగ్ అంశంపై బీఆర్ఎస్ సర్కార్ (government) సీరియస్‌గా ఉంది. ఇదే అంశంపై పలుమార్లు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినా.. ఫలితం లేదు. ఇక చేసేది లేక సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (supreme court) తలుపు తట్టింది. పెండింగ్ బిల్లుల గురించి ప్రస్తావింస్తూ.. రిట్ పిటిషన్ (writ petition) దాఖలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (shanti kumari) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన 10 బిల్లులు (10 bills) పెండింగ్ పెట్టారని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. పెండింగ్ బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. పిటిషన్లో ప్రతివాదిగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను (governer Tamilisai Soundararajan ) చేర్చారు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 10 బిల్లులను (10 bills) గవర్నర్ ఆమోదించలేదని ప్రభుత్వం చెబుతోంది.
మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, అటవీ వర్సిటీ అప్ గ్రేడ్ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయి మెంట్ చట్ట సవరణ బిల్లు, మోటార్ వెహికిల్ టాక్సేషన్ సవరణ బిల్లు, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సవరణ బిల్లు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.