ADB: నార్నూర్ మండలంలోని మాన్కపూర్ దిశా మోడల్ స్కూల్‌ను గురువారం ఐటిడిఏ పీవో యువరాజ్ మర్మాట్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయుల రికార్డులు, బోధన పద్దతిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పాఠాలు బోధించారు. సీసీ రోడ్డు, RO వాటర్ ప్లాంట్ మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రేణుక నాగోరావ్, సిబ్బంది పాల్గొన్నారు.