ADB: తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామ రైతులు ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు. ఎకరానికి 7 క్వింటాళ్ల శనగపంట కొనుగోలు పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచాలని వారు కోరారు. ఈ ఏడాది దిగుబడి అధికంగా వచ్చిందని, ప్రస్తుత పరిమితి సరిపోవడం లేదని, మిగిలిన పంటను తక్కువ ధరకు అమ్ముకోలేక నష్టపోతున్నామని రైతులు తెలిపారు.