HYD: దేశంలోనే అతిపెద్ద భక్తి కేంద్రంగా నిలిచిన ఖైరతాబాద్ గణేష్ ప్రజల విశ్వాసం, ఐక్యతకు ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుని స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించి సుభిక్షం, శాంతి ప్రసాదించాలని ప్రార్థించానన్నారు.