HNK: జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీపీఎం పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి చుక్కయ్య అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు సమన్వయంతో కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.