GDWL: బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తామని చెప్పి, బడ్జెట్లో ఇప్పుడు కేవలం రూ.12,511 కోట్లు కేటాయించడం అంటే బడుగు బలహీన వర్గాల గొంతు కోయడమే అని గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ బాసు హనుమంతు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బడ్జెట్ పేదల అభివృద్ధి చూడకుండా, ప్రభుత్వ అభివృద్ధి చూసుకుంటోందన్నారు.