WGL: తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శిక్షణ కేంద్రానికి కూసం రాజమౌళి పేరును కేటాయిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. జాతీయ ఆదర్శ గ్రామమైన గంగాదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి ఇటీవల మృతి చెందగా ఆయన సంస్మరణ సభలో మంత్రి పాల్గొన్నారు. గుర్తింపు కోసం కాకుండా సమాజం కోసం పని చేసిన నాయకుడిగా రాజమౌళి నిలిచారని పేర్కొన్నారు.