NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా మెండోరా మండలంలో ఈరోజు 10 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ఎంపీడీవో లక్ష్మణ్ తెలిపారు. దీంతో 11 సర్పంచ్ స్థానాలకు గాను మొత్తం 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు. అలాగే, 76 వార్డు స్థానాలకు పోటీ ఉందని ఎంపీడీవో లక్ష్మణ్ వెల్లడించారు.