MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వినాయక విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకొని జన్నారంతో పాటు అన్ని గ్రామాలలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. శుక్రవారం సాయంత్రం ఆయా వినాయక విగ్రహాలకు నిర్వాహకులు పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలలో ఉంచి శోభాయాత్ర నిర్వహించి గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు.