SRD: ఈనెల 14న పట్టణంలో నిర్వహించనున్న అంబేడ్కర్ జయంతి మహా ర్యాలీ కరపత్రాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవిష్కరించారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ భారీ ర్యాలీకి దళిత, గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.