JGL: జిల్లాలో పెట్రోల్ సరఫరాకు కొరత లేకుండా చూడాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల ఐడీఓసీలో సోమవారం పెట్రోల్ బంక్ అసోసియేషన్ ప్రతినిధులు, బంక్ యాజమాన్యాలు, చమురు సంస్థల సేల్స్ ఆఫీసర్లతో సోమవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులలో అందుబాటులో ఉన్న నిల్వల వివరాలను తెలుసుకున్నారు.