PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామానికి చెందిన దబ్బేట శ్రీకాంత్ ఇటీవల తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీఈఐఆర్ సాంకేతికత ద్వారా ఫోన్ ఉన్న చోటును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ నీలిమా బాధితుడు శ్రీకాంత్‌ను పిలిపించి ఫోన్‌ను అందజేశారు.