NLG: దేవరకొండ కె.టి.ఎస్ పాఠశాలలో ‘ఆవిష్కర్’ రోబో ఫెస్ట్ ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా డీస్పీ శ్రీనివాస్, సీఐ వెంకట్ రెడ్డి హాజరై విద్యార్థుల ఆవిష్కరణలను అభినందించారు. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శర్మ, రఘువీర్ చారి, రాజ్ కుమార్, నవీన్, అన్వర్ హుసేన్ పాల్గొన్నారు.