నల్గొండ జిల్లాలో ప్రప్రథమంగా అంధ విద్యార్థులకు ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్ సదుపాయాలను జిల్లా గ్రంథాలయంలో ప్రారంభించడం గర్వకారణమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బ్లైండ్ (దృష్టి లోపం) పాఠకులు, విద్యార్థులకై ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్‌ను ఆయన ప్రారంభించారు.