GDWL: మల్దకల్ మండల కేంద్రంలోని తిమ్మప్ప స్వామిని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఛైర్మన్ ప్రహ్లాద రావు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి దర్శనం సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు.