NLG: నాంపల్లి మండలంలో రోడ్డుపై డ్రైనేజీ నీరు నిలవడంతో ప్రయాణికులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి వల్ల రోడ్డుపై ఉన్న గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. మురికి నీటితో దోమలు, ఈగలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదముందని, అధికారులు స్పందించి నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.