MDK: అభివృద్ధి పనులను నాణ్యవంతంగా చేపట్టాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. పెద్ద శంకరంపేటలో ఇటీవల కాలంలో సిసి రోడ్డు నాణ్యత లేకుండా నిర్మించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అదే రహదారిపై రూ. 15 లక్షలతో మళ్లీ సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇలాంటి దుస్థితి మరోసారి రాకుండా చూడాలన్నారు.