NGKL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చేయడం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం లాంటిదని బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కృపానందం గురువారం అన్నారు. ఓట్లు లేకుండా ఏకగ్రీవాలు చేస్తే అప్రజాస్వామికం అవుతుందన్నారు. ఏకగ్రీవం కోసం డబ్బిస్తామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నా, రాష్ట్ర ఎన్నికల సంఘం, కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.