VKB: గోకఫసల్వాడ్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించగా, ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో, జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. స్వామి కృప అందరికీ అందాలని ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు.