PDPL: ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పెండింగులో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఆయన ఇవాళ ఐడీఓసీలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మంథని మండలం నాగారంకు చెందిన లక్ష్మి ఇందిరమ్మ ఇల్లు కావాలని దరఖాస్తు చేశారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన వితంతువు పద్మ అంత్యోదయ రేషన్ కార్డు మంజూరు చేయాలని ఆర్జీ సమర్పించారు.