HYDలో ఆర్టీసీ బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేయాలని అధికారులు స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. పైలెట్ ప్రాజెక్టుగా విద్యార్థుల బస్సు పాస్‌లను స్మార్ట్ కార్డులుగా మార్చనున్నారు. అనంతరం మహాలక్ష్మీ ఉచిత ప్రయాణ పథకం లబ్ధిదారులు, సాధారణ ప్రయాణికులందరికీ వీటిని జారీ చేయాలని యోచిస్తున్నారు.