JGL: మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బ్లూఫాక్స్ వెనుక 8, 9 వార్డుల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లపై అధికారులు బుధవారం చర్యలు చేపట్టారు. జేసీబీతో హద్దురాళ్లు, ఖనీలను తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో నిర్మాణ అనుమతులు ఇవ్వబడవని హెచ్చరించారు.