PDPL: ధర్మారం మండలం నంది మేడారం శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో గురువారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం గణపతి హోమం, పుణ్యవచనం మొదలైన కార్యక్రమాలు సాయంత్రం నిర్వహించిన కల్యాణోత్సవాన్ని వీక్షించడానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారి కళ్యాణ తంతును భక్తిశ్రద్ధలతో తిలకించారు.