హన్మకొండ: కమలాపూర్ మండలం మర్రిపల్లి గ్రామంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న రమేశ్ అనే వ్యక్తిని గురువారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ. 39 వేల విలువైన 9.6 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.