WGL: పర్వతగిరి మండలం చెరువుముందు తండాలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ సంప్రదాయాలు సమాజ ఐక్యతకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. తండా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.