BHPL: గోరికొత్తపల్లి (M) నిజాంపల్లి గ్రామంలో బుధవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయనున్నట్లు GP కార్యదర్శి రంజిత్ మంగళవారం తెలిపారు. గ్రామంలోని అన్ని పశువులకు టీకాలు వేయించాలని, నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ఉదయం 6 గంటలకు GP కార్యాలయం వద్ద కార్యక్రమం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.