KNR: చొప్పదండిలోని జవహార్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు రేపటిలోగా అప్లై చేసుకోవాలని ఆయన సూచించారు. 2025- 26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.