MNCL: భీమిని నూతన SI గా కోటేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ములుగు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన రామగుండం వీఆర్‌కు బదిలీ అయిన విజయ్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజా ప్రతినిధులు, ప్రజలు సహకరించాలన్నారు.