MGL: గోవిందరావుపేట మండల పరిధిలో పస్రా గ్రామ సమీపంలో జాతీయ రహదారి 163పై సోమవారం రాత్రి 11 గంటలకు కంటైనర్ లారీ డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన డ్రైవర్ను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.