RR: అప్పుడే పుట్టిన శిశువును చెట్ల పొదల్లో పడేసిన ఘటన రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని మల్కాపహాడ్లో మంగళవారం రాత్రి ఇటుక బట్టీల సమీపంలో ముళ్లపొదల్లో శిశువు ఏడుపు శబ్దాలు వినిపిస్తుండడంతో రవీందర్ అనే వ్యక్తి శిశువును రక్షించి పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి శిశువును శిశువిహార్‌కు తరలించారు.