NRPT: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరన్న, మరికల్ సర్పంచ్ గూప చెన్నయ్య, పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్లు అన్నారు. భారత మాజీ పీఎం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మరికల్లో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామన్ గౌడ్, వార్డు సభ్యులు అశోక్, రామకృష్ణ, రఘు, మాజీ ఎంపీటీసీ గోపాల్, సూర్య ప్రకాష్,ఆనంద్ కుమార్ ఉన్నారు