PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంతం పరిధిలోని గోదావరిఖని పట్టణంలో ఇవాళ సివిల్ సప్లై అధికారులు పలు హోటల్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు గృహ వినియోగానికి ఉపయోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో 5 హోటళ్లపై కేసులు నమోదు చేసి, 5 సిలిండర్లు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.