SRPT: కోదాడ పట్టణంలో మంగళవారం రాత్రి కోదాడ-మేళ్లచెరువు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తోగర్రాయి గ్రామానికి చెందిన హరీష్, అభిలాష్, లక్ష్మీనారాయణలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.