WNP: ఆత్మకూరు మండలంలోని పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎస్సై జయన్న తోటి మహిళా పోలీస్ సిబ్బందిని శాలువాతో సత్కరించి వేడుకలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో అన్ని రంగాలలో రాణించాలని, రాజకీయ రంగాలలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.