JN: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణను TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి కలిశారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై స్వర్ణతో ఝాన్సీరెడ్డి క్షుణ్ణంగా చర్చించారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని స్వర్ణ సూచించారు.