MHBD: రాజ్యసభ సభ్యునిగా వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళీనాయక్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని నరేందర్ రెడ్డిని అభినందించారు.