WGL: వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయాన్ని వరంగల్ తూర్పు మాజీ MLA నన్నపునేని నరేందర్ బుధవారం సందర్శించారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారు ఈరోజు గాయత్రిదేవి రూపంలో దర్శనమివ్వగా నరేందర్ అమ్మవారిని దర్శించుకుని, పూజలు చేశారు. అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందచేసి, ఆశీర్వచనాలు ఇచ్చారు. కార్యక్రమంలో BRS నాయకులు, తదితరులున్నారు.