BHNG: బాలికలకు మంచి వసతులతో ఆశ్రమం నిర్వహణ చేయాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత కోరారు. బుధవారం భువనగిరిలోని బాలసదన్ను సందర్శించి బాలికలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అక్కడి వసతులను పరిశీలించారు. బాలికల ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారి అభివృద్ధికి చిత్రలేఖనం, వ్యాసరచన, ప్రసంగం అంశాలలో శిక్షణ ఇవ్వాలన్నారు.