MDK: నిజాంపేట మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద రూ.7 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఆదివారం సర్పంచ్ చలిమేటి నరేందర్, కాంగ్రెస్ నాయకులు ఈ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు సర్పంచ్, గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.