BDK: చర్ల మండలంలోని ఉప్పరగూడెం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ సెక్టార్ సమావేశం ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ మాట్లాడుతూ.. చర్ల మండలంపై బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి గాని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి గాని ఎటువంటి ప్రేమ, చిత్తశుద్ధి లేదని విమర్శించారు.